ఆ మూవీ హిట్ అయితే నువ్వు ఎప్పటికీ స్టార్ హీరో కాలేవు.. మహేష్ కి చివాట్లు పెట్టిన కృష్ణ.. కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. త్రివిక్రమ్ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో శ్రీ లీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీలో మహేష్ బాబు నటించిన బోతున్నాడు. అయితే ప్రస్తుతం స్టార్ హీరోగా మంచి క్రేజ్‌లో దూసుకుపోతున్న‌ మహేష్ బాబును గతంలో ఓ సినిమా విషయంలో సూపర్ స్టార్ కృష్ణ నువ్వు ఈ సినిమా హిట్ అయితే ఎప్పటికీ స్టార్ హీరోవి కాలేవు అంటూ చివాట్లు పెట్టాడట.

ఇంతకీ ఆ మూవీ ఏంటి.. ఎందుకు కృష్ణ గారు అలా అన్నారు.. ఇప్పుడు చూద్దాం. ఎస్. జె సూర్య డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా అమీషా పటేల్ హీరోయిన్గా నటించిన మూవీ నాని. ఈ సినిమా మే 14, 2004 సంవత్సరంలో ప్రేక్ష‌కుల‌ ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. కాగా ఈ సినిమా షూటింగ్ టైంలో కృష్ణ – మహేష్ బాబు సెట్స్ కు వెళ్లారట. ఆ టైంలో కృష్ణ.. మహేష్ బాబు తో మాట్లాడుతూ ఈ సినిమా హిట్ అయితే నువ్వు ఎప్పటికీ స్టార్ హీరో కాలేవు అని చెప్పాడట. మహేష్ బాబుకు అప్పుడు కృష్ణ ఎందుకు అలా చెప్పారో అర్థం కాలేదట.

అయితే తర్వాత సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ కావడంతో మహేష్.. కృష్ణ దగ్గరకు వెళ్లి నాన్న ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని మీకు ముందే తెలుసా.. ఎందుకు అప్పుడు నాతో అలా అన్నారు.. అని అడిగాడట. అప్పుడు కృష్ణ మాట్లాడుతూ ఫ్లాప్ సంగతి ప‌క్క‌న‌ పెట్టు.. ఈ సినిమాకు ముందే నువ్వు ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చావ్. సో దీన్ని బట్టి ఆడియన్స్ నీ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమాలకు.. మంచి కథను ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి నువ్వు కథ వినేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండు. మంచి కథను సెలెక్ట్ చేసుకో అంటూ చెప్పుకొచ్చారట. దీంతో మహేష్ బాబుకు – కృష్ణ గారు చెప్పింది అర్థమైంది. అప్పటినుంచి మహేష్ ఏదైనా కథను ఎంచుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాడట.