ఓ బాహుబలి- ఓ పుష్ప- ఓ దేవర .. ఆ తరువాత మన చిరంజీవినే.. ఇన్నాళ్లకి మంచి నిర్ణయం తీసుకున్న మెగాస్టార్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ .. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కూడా బాహుబలి – పుష్ప – దేవర సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే . ఈ సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్స్ నటించబోతున్నట్లు ఓ ప్రచారం జరుగుతుంది .

అంతేకాదు ఈ సినిమాలో దేవత పాత్రలో శ్రీలీల కనిపించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. కాగా ఈ సినిమాను వశిష్ట రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారట . బాహుబలి – పుష్ప – దేవర సెంటిమెంట్ ను బేస్ చేసుకుని వశిష్ట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . అయితే బాహుబలిలో ప్రభాస్ ..పుష్పలో అల్లు అర్జున్ .. దేవరలో ఎన్టీఆర్ వీళ్ళందరూ యంగ్ హీరోస్ కాబట్టి జనాలు లైక్ చేశారు .

ఇక్కడ మాత్రం చిరంజీవి. ఆల్రెడీ వయసు అయిపోయింది. మరి అలాంటి పెద్దాయనతో రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కించడం అంటే బిగ్ రిస్క్ అనే చెప్పాలి . కానీ ఎందుకు వశిష్ట ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాడో తెలియడం లేదు . అంతేకాదు ఈ సినిమా కోసం 500 కోట్ల బడ్జెట్ ని కూడా పెట్టడానికి రెడీ అవుతున్నారట . దీంతో సినిమాలో ఆ సత్తా ఉంది అని అందుకే ఈ రేంజ్ లో హంగామా చేస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో..?