” భర్త వేరే అమ్మాయితో ఉంటే అస్సలు తప్పు కాదు “… సింగర్ చిన్మయి సెన్సేషనల్ కామెంట్స్…!!

టాలీవుడ్ సింగర్ చిన్మయి మనందరికీ సుపరిచితమే. మొదట చిన్మయి ప‌లు సినిమాలలో సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత సింగర్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో పాటలు సైతం పాడింది. ఇక డైరెక్టర్ రాహుల్ ను పెళ్లి చేసుకుని అన్నిటికీ దూరమైంది. వీరిద్దరికి ఇద్దరు సంతానం కూడా కలిగారు. ప్రస్తుతం చిన్మయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది. అలాగే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సైతం ఇస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా చిన్మయికు ఓ నెటిజన్ తన సమస్యను వివరించింది. ” హలో చిన్మయి గారు.. నా సమస్యను మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు లేదంటే డెలివరీ టైం లోను.. ఇతర కారణాల వల్ల భర్తతో ఫిజికల్ గా కలవలేరు కాబట్టి.. వాళ్లు బయట వేరే వాళ్లతో రిలేషన్ పెట్టుకోవడం లీగల్ అంట. ఇంట్లో అందరూ అతనికే సపోర్ట్ చేస్తున్నారు.

నేనేం చేయలేకపోతున్నాను. తిరిగి అడిగితే.. ఓపిక పట్టాలి.. సర్దుకోవాలి అని నాకే రివర్స్ లో చెబుతున్నారు ” అంటూ రాసుకొచ్చింది. దీనికి చిన్మయి తన ఇన్స్టాలో షేర్ చేసి స్ట్రాంగ్ గా స్పందించింది. ” వీళ్లే సొసైటీలో నలుగురు.. ఇదే వాళ్ళ కల్చర్. ఇప్పుడు అర్థం అవుతుందా? ఈ నలుగురికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని ” అంటూ సలహా ఇచ్చింది. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఇది చూసిన మహిళలు.. ఆమె భర్తని తిట్టిపోస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)