మోడల్ గా కస్తూరి యాంకర్ గా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలను నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉంది నటి కస్తూరి శంకర్.. కెరీయర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నట్టుగా తెలియజేసింది. తాజాగా కస్తూరి శంకర్ ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను సైతం తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.
నటి కస్తూరి అసలు పేరు సుమతి శంకర్.. ఈమె లా చదువుకున్నప్పుడు కస్తూరిగా నటిగా ఎదిగింది..అలా తెలుగు మలయాళం కన్నడ తమిళ్ వంటి భాషలలో నటించింది. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు కస్తూరి మోడల్ గా యాంకర్ గా కూడా పనిచేస్తుందట. 1992 లో మిస్ చెన్నైగా కూడా గెలుపొందింది.ఆ తర్వాత సేమిన మిస్ ఇండియా పోటీలలో కూడా సెలెక్ట్ అయింది. 2019లో తమిళ బిగ్ బాస్ 3లో కంటిస్టెంట్ గా పాల్గొనడం జరిగిందట. సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఒక రూమర్స్ వల్ల తమ తల్లిదండ్రులు తనకి వివాహం చేశారని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది
వరుస సినిమాలలో నటిస్తున్న సమయంలో ఒక ఇండస్ట్రియల్ తో ఎఫైర్ ఉందంటూ రూమర్లు వచ్చాయట.దీంతో తన కుటుంబ సభ్యులు భయపడి త్వరగానే వివాహం చేశారట. అప్పుడు వారు చేసింది కరెక్టే అని తనకు అనిపించింది. అందుకే ఆ విషయంలో తాను ఎప్పటికీ బాధపడను అని తెలిపింది. జీవితంలో ఎన్నో కష్టాలను చూశాను ప్రస్తుతం జీవితం చాలా ఆనందంగా ఉందంటూ తెలుపుతోంది.. తప్పును తప్పని చెబితే కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు.వాటిని పట్టించుకోనని తెలిపింది.. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన సింధూరం సినిమాలో అవకాశం వచ్చిందని కొన్ని కారణాల చేత తనని తొలగించారని తెలిపింది. ఇటీవలే రస్మిక తల్లి పాత్రలో యానిమల్ సినిమాలో నటించే అవకాశం రాగా అక్కలాగ ఉంటానని వదిలేసానని తెలిపింది. 2000 సంవత్సరంలో శ్రీ కుమార్ సుబ్రమణియన్ తో వివాహమయిందని కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడాకులు తీసుకోవడం జరిగిందట. వీరికి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు.