రకుల్ ప్రీత్ కెరీర్ నాశనం కావడానికి కారణం ఆమెతో ఫ్రెండ్ షిప్ చేయడమేనా..?!

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న రకుల్‌కు టాలీవుడ్ లో మెల్లమెల్లగా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌రి మక్కాం మార్చేసింది. ప్రస్తుతం అక్కడ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా కొనసాగుతుంది. సౌత్ ఇండియాలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ను దక్కించుకున్న రకుల్ కి సడన్గా సినిమా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం మరో స్టార్ బ్యూటీ తో రకుల్ ఫ్రెండ్‌షిప్ అని న్యూస్ వైరల్ అవుతుంది.

Telugu Drugs, Friendship, Sushantsingh, Tollywood-Movie

ఇంతకీ ఆమె ఎవరు.. రకుల్ కెరీర్ నాశనం అవ్వడానికి ఆమెకు సంబంధం ఏంటి.. అనుకుంటున్నారా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా బాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం వేచి చూస్తున్న టైం లో పూర్తిగా ముంబైలోనే సెట్టిల్అవాల్సి వచ్చింది. అయితే దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకున్న రియా చక్రవర్తి మంచి ఫ్రెండ్ గా మారింది. వీరిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండడంతో రకుల్ కెరీర్ పై కోల్కోలేని దెబ్బ పడిందని స‌మాచారం. రియా చక్రవర్తి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లవర్ అన్న సంగతి తెలిసిందే.

Telugu Drugs, Friendship, Sushantsingh, Tollywood-Movie

ఈ కేసు విషయంలో ఈమె జైలుకు కూడా వెళ్లి వచ్చింది. అయితే సుశాంత్ ఆత్మహత్య విషయంలో ఈమెకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఇలా సుశాంత్ కేసు నుంచి బయటపడిన తర్వాత డ్రగ్స్ కేసులో ఈమె పేరు మళ్లీ మారుమోగింది. ఇలా డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి పేరుతో పాటు నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటకు వచ్చింది. కేవలం రియా చక్రవర్తి తో స్నేహం చేయడం వల్లే రకుల్ పేరు కూడా డ్రగ్స్ కేసులో చేరిందని.. అయితే డ్రగ్స్ కేసులో రకుల్ పేరు బయటకు రావడంతో మెల్లమెల్లగా సినిమా అవకాశాలు తగ్గిపోయాయంటూ సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.