అనుష్క ఎంత ప్రయత్నించిన బరువు తగ్గకపోవడానికి కారణం ఆ మెడిసినేనా.. ?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకటి. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు గ‌డుస్తున్న ఇంకా ఇండ‌స్ట్రీలో కొనసాగుతుంది. మధ్యలో అధిక బరువు కారణంగా కాస్త బ్రేక్ ఇచ్చినా మళ్ళీ సినిమాలను మొదలుపెట్టి వరుస అవకాశాలను అందుకుంటుంది. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్రహిరలా అందరి సరసనను నటించింది. ఎన్నో హిట్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తెలుగు లేడీ సినిమాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. టాలీవుడ్ లో ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించిన అనుష్క నటించిన భాగమతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ గా తన 50వ సినిమా రాబోతుందంటూ న్యూస్ కూడా వైరల్ అయింది. ఇక తన సినిమాల‌లో ప్రయోగాత్మక సినిమాలలో సైజ్ జీరో ఒకటి. ఈ సినిమా తన సినీ కెరీర్ పై చాలా ఎఫెక్ట్ చూపించింది. ఈ సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగిపోయింది. అనంతరం బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆమె బరువు తగ్గాలేక పోతుంది. కొంతకాలం పాటు సినిమాలకు కూడా దూరంగా ఉంది. ఇక సినిమాల కంటే ముందు ఒక టీచర్ గా ఉన్న అనుష్క ఎన్నో యోగాలు చేస్తూ డైట్ ఫాలో అవుతున్నప్పటికీ బరువును మాత్రం కంట్రోల్ చేసుకోలేక పోతుంది. అయితే ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అనుష్క బరువు తగ్గక పోవడానికి ఆమెకు ఉన్నావా సమస్య కారణమట.

ఆమె తరచూ ఆ సమస్యకు సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆమె బరువు తగ్గలేక పోతుందట.


అనుష్క థైరాయిడ్ సమస్యతో బాధపడుతుందట. అలా థైరాయిడ్ సమస్య ఉన్నవారు శరీర బరువు తగ్గడం చాలా కష్టం. దీని కారణంగానే ప్రతిరోజు మందులు ఉపయోగించడం వల్ల ఆ మందుల ప్రభావంతో అనుష్క బరువు తగ్గలేకపోతున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా అనుష్క మునుపటిలా తయారవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవీ సక్సెస్ కావడం లేదు. ఇక మధ్యలో వెయిట్ కారణంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అనుష్క మిస్‌శెట్టి మిస్టరీ పోలిశెట్టి హిట్ కావడంతో మరోసారి అవకాశాలను అందుకుంటుంది. ఇతర భాషల్లో సినిమాలో నటించడానికి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.