మొదట చై-సామ్..ఆ తరువాత వరుణ్-లావణ్య..ఇప్పుడు ఈ స్టార్ హీరో-హీరోయిన్..పెళ్లికి రెడి అయిన మరో లవ్ బార్డ్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు స్టార్ హీరోలు పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. రీసెంట్ గా హీరో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.  హైదరాబాదులో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఇచ్చారు ఈ కొత్త జంట . అంతేకాదు ఈ కొత్త జంట త్వరలోనే ఓ సినిమా కూడా చేయబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అయితే లావణ్య కంటే ముందు చైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .

ఆ తర్వాత చాలామంది హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న వీళ్ళ జంట మాత్రమే ఫేమస్ అయ్యింది . అయితే ఒకప్పుడు చైతన్య సమంత ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఇప్పుడు లావణ్య వరుణ్ అలాగే పెళ్లి చేసుకున్నారని త్వరలోనే మరో టాలీవుడ్ కపుల్ కూడా ఇలా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని  ప్రచారం జరుగుతుంది.  ఆ జంట మరెవరో కాదు రామ్ పోతినేని – అనుపమ పరమేశ్వరన్ .

వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు వీళ్ళ పెళ్లికి ఇంట్లోని పెద్దలు కూడా ఒప్పుకున్నారట . కానీ రామ్ పోతినేని లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడట . ఆ కారణంగానే వీళ్ళ పెళ్లి లేట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి . స్కంద ఫ్లాప్ తర్వాత రామ్ పోతినేని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయారట.  త్వరలోనే వీళ్ల పెళ్ళికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!