శీతాకాలంలో బీపీ పెరుగుతుందా.. అయితే తప్పకుండా తీసుకోవాల్సిన చిట్కాలు ఇవే…!!

చలికాలంలో చాలామందికి బీపీ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. చలికాలంలో సాధారణ జీవనశైలిలో చేసే తప్పుల కారణంగా అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. శారీరక శక్తి తగ్గడం, చురుగ్గా ఉండకపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. తద్వారా బీపీ కూడా పెరుగుతుంది. చాలామంది చలికాలంలో చల్లటి వాతావరణం వల్ల వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపుతారు.

దీనివల్ల శ్రమ తగ్గిపోయి రక్తపోటు ఏర్పడుతుంది. అలాగే చల్లటి వాతావరణం లో వేడిగా ఉండే ఆహారాలను తింటుంటారు. వీటి వల్ల బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అది ఏ సీజన్ అయినా ఉప్పు తక్కువగా తినడమే మంచిది. చలికాలంలోనూ కూరల్లో తక్కువ ఉప్పు వేసుకోవాలి. అలాగే చలికాలంలో చాలా మంది తక్కువ వాటర్ తాగుతూ ఉంటారు.

ఇది చాలా తప్పు.. అది ఏ కాలమైనా వాటర్ ఎక్కువగా తాగడమే మంచిది. అలాగే వాతావరణం చల్లగా ఉండడంతో టీ, కాఫీలకు అలవాటు పడుతూ ఉంటారు. దీని వల్ల కూడా బాడీ తొందరగా డిహైడ్రేట్ అయిపోతుంది. అలాగే చాలామంది చలికాలంలో కళ్ళు, చేతులు ముడుచుకుని పడుకుంటారు. ఇది రక్తం పేరుకు పోవడానికి సహాయపడుతుంది. ఇటువంటి అలవాట్లను చలికాలంలో అసలు చేయొద్దు. చేస్తే మీ ప్రాణానికే ప్రమాదం.