కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా..?

కార్తీకమాసం అంటే ప్రతి ఒక్కరికి దీపాలు వనభోజనాలు వంటివి ఎక్కువగా గుర్తుకు వస్తాయి. మరి కొంతమందికి ఉసిరి చెట్టు కూడా గుర్తుకువస్తుంది.. అయితే ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం అనేది హిందూ సాంప్రదాయంగా చూస్తారు. హిందూ పండుగలకు ఈ ఉసిరి చెట్టు కింద ఆరోగ్య రహస్యాలు సైతం ఉన్నాయని విషయాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. చాలా మంది ఆచారాలు కూడా నమ్ముతూ ఉంటారు. మన పూర్వీకులు కూడా ఎక్కువగా ఇలాంటివి నమ్మేవారు.

ఎక్కువగా కార్తీక మాసంలో పూజలు స్నానాలు దీపాలు ఉసిరి చెట్టు కింద భోజనం వంటివి చేయడం వల్ల చాలామంది ఆయురారోగ్యాలతో పాటు సంపదపరంగా కూడా బాగా ఉండేవారని తెలుస్తోంది. భూమి మీద ఎన్నో చెట్లు ఉన్నప్పటికీ కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు భోజనం చేయాలి ఇదే ఎందుకు సాంప్రదాయంగా వస్తోంది.. దీని వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఒకసారి మన తెలుసుకుందాం.

కార్తీక మాసంలో శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరు కూడా ఒకే చోట కొలువై ఉంటారట.. వీరిద్దరూ ఉండేది ఉసిరిని భూతముగా కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో అమృత బిందువుల నుంచి పుట్టినదే ఈ ఉసిరి మొక్క ఉసిరిలో అందుకే అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణుల సైతం తెలియజేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు గాలి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని అటువంటి ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షముగా పిలుస్తూ ఉంటారు. ఉసిరిని ఎక్కువగా సంజీవని లాంటిదని కూడా పిలుస్తూ ఉంటారు. విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ చెట్టు కింద కార్తీకమాసంలో పూజించి భోజనం చేయడం వల్ల అన్ని మంచి గా జరుగుతుందని నమ్మకం ఉన్నది.