కన్నతల్లికి కష్టాల్లో ఒక రూపాయి కూడా సహాయం చేయని స్టార్ హీరోయిన్.. దుస్థితిలో శృతిహాసన్ తల్లి..

శృతిహాసన్ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండియాలో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించి కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శృతిహాసన్ ప్రస్తుతం భారీ రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ కోట్ల‌లో ఆసిని కూడబెడుతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను ఫాలో అవుతూ క్రేజీగా దూసుకుపోతుంది. అయితే కేవలం హీరోయిన్ గానే కాక సింగర్ గా కూడా తన టాలెంట్ ను చూపిస్తున్న శృతి.. ఆమె తల్లి విష‌యం మాత్రం అసలు పట్టించుకోవడం లేదంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయినా సారిక – కమల్ హాసన్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు శృతిహాసన్, అక్షరాహాసన్ ఉన్నారు.

అయితే గత కొంతకాలంగా శృతిహాసన్ తన తల్లికి దూరంగా ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్త‌లు వైరల్ వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రీసెంట్గా శృతిహాసన్ తల్లి సారిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ తనను దూరంగా పెడుతుందని.. తన దగ్గరకు ఎక్కువగా రావటం లేదని, త‌నతో అసలు మాట్లాడటం లేదని వివరించింది. లాక్ డౌన్ టైం లో సారికకి తినడానికి తిండి లేదు, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని.. అలాంటి సమయంలో శృతిహాసన్‌కి కమల్ హాసన్‌కి ఇద్దరికీ ఫోన్ చేసినా కూడా వాళ్లు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదంటూ చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ఇప్పటికి కూడా నా కష్టంతో నేను బ్రతుకుతున్నానని.. నాకు ఒక్క రూపాయి కూడా ఎవరు సహాయం చేయడం లేదని.. రూమ్ రెంట్ కట్టుకుంటూ.. నా లైఫ్ ని గడపడం చాలా కష్టంగా ఉంది అంటూ వివరించింది. ఇక ఈమె ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. స్టార్ హీరోయిన్ అయినా శృతిహాసన్ తల్లిని అలా దూరంగా ఉంచి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ.. స్టార్ హీరోయిన్గా కోట్లు వెనకేసుకుంటే సరిపోదు కన్నతల్లిని కూడా అర్థం చేసుకోవాలి అంటూ.. నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.