గింజలు, విత్తనాలాంటి చిరుదాన్యాలు మనం హెలందిగా ఉండటానికి బాగా సహకరిస్తాయి. ఈ విత్తనాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. పోషకాహారం తీసుకోవడం వలన హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే పలు విత్తనాల వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, హెల్దిగా ఉంటామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవే అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి.
అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజు తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలానే నువ్వులు కూడా ఆరోగ్యాని మెరుగుపరుస్తాయి. మనల్ని హెల్దిగా చేస్తాయి. నువ్వుల్లో యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఉంటాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. నువ్వులు కణజాలంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి.
అలానే చియా సీడ్స్ కూడా ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తాయి. చియా సీడ్స్ ని తీసుకుంటే పోషకాలు సంవృదిగా అందుతాయి. గుండెలో మంట సమస్యకు ఉపసమనం లభిస్తుంది. సన్ ఫ్లవర్ సీడ్స్ లో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్ఫ్లవర్ సీడ్స్ లో ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయి. గుమ్మడి విత్తనాలలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి.