ఇకపై నన్ను హనీ అని కాదు.. అలా పిలుస్తారు.. మెహరీన్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా తన కెరీర్ కొనసాగిస్తుంది మెహరీన్. ఆమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే మెహరీన్ కు మంచి స‌క్స‌స్ తెచ్చిపెట్టాయి. వీటిలో ఒకటి ఎఫ్2. ఈ మూవీలో మెహరీన్ పోషించిన హానీ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మెహరీన్ అని కాకుండా హనీ ఇస్ ద బెస్ట్ అనే డైలాగ్ తో నన్ను పిలుస్తూ ఉంటారు అంటూ బహిరంగంగా చాలా సందర్భాల్లో చెప్పింది. ఇక మెహ‌రిన్ తాజాగా స్పార్క్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ స్పార్క్ మూవీలో నేను.. లేఖ‌ పాత్రలో కనిపించాను. నాది ఈ మూవీలో కీల‌క పాత్ర‌. ఈ మూవీ స్టార్ట్ అయ్యేది నా రోల్ తోనే. నాతోనే ఎండ్ అవుతుంది కూడా. ఇలాంటి థ్రిల్లర్లో నటించిడం నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. ఇది నెకు ఓ కొత్త అనుబ‌వం. నేను ఏదైనా ఈవెంట్‌కి వెళ్తే నా సినిమా ప్రమోషన్ లో ఉన్నప్పుడు ఎవరైనా నా మూవీ క్యారెక్టర్ రోల్ తో పిలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతా. ఇక అదే నాకు స్పార్క్ మూమెంట్గా కనిపిస్తుంది.

ఇక నిన్న మొన్నటి వరకు నన్ను హనీ, మహాలక్ష్మి లాంటి పేర్లతో పిలిచారు. ఇకపై నన్ను లేఖ అంటూ పిలుస్తారు అంటూ మెహరీన్ వివరించింది. ఇక ఈవెంట్లో ఈమె మాట్లాడిన విధానాన్ని బట్టి సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుందని అర్థమవుతుంది. ప్రస్తుతం మెహరీన్ చేతిలో ఉన్న అతి కొద్ది సినిమాలలో స్పార్క్ ఒకటి. ఇక తమిళంలో ఓ సినిమా నటిస్తుంది. స్పార్క్ మాదిరిగానే అది కూడా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతుంది. ఇక మెహరీన్ తాజాగా నటించిన ఈ రెండు సినిమాలు హిట్ అయితే తన కెరీర్‌లో మళ్ళీ పుంజుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.