మునగ పువ్వు తో ఇన్ని ప్రయోజనాల.. తెలిస్తే అశ్చ‌ర్య‌పోతారు..

మునగకాయలు , మున‌గ ఆకులు చాలా మంది ఆహ‌రంగా తీపుకుంటారు. ఇక మున‌గ‌కాయ టేస్ట్, వాటిలో ఉండే పోషక విలువ‌ల గురించి అందరికీ తెలుసు. మునగ పువ్వుల్లో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, చాలా స‌మ‌స్య‌ల‌ను కంట్రోల్ చేయ‌వ‌చని మీకు తెలుసా..? మునగ పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ప్రి రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. ముఖంపై ముడతలను నివారించడానికి మునిగ పువ్వు ఎంత‌గానో సహకరిస్తుంది. వీటిలో ఉండే ప్రోటీన్ జుట్టు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

అయితే ఇటీవల కాలంలో 40 సంవత్సరాలు దాటిన చాలామంది కీళ్లనొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి పరిస్థితికి దూరంగా ఉండాలంటే మునగ పూలను ఆహారంలో చేర్చుకోండి. వాటిలో యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు ఉంటాయి. కీళ్ల నొప్పులు, వాపు సమస్యలకు కూడా మునగ పువ్వుతో చెక్ పెట్టవచ్చు. కొంతమందిలో ఎంత తక్కువ తిన్న జీర్ణ వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారు ఈ పూలను భోజనంల్లో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి, పిచ్చు పదార్థం పుష్కలంగా శరీరానికి అందుతుంది.

దీంతో మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక మునగ పువ్వులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. ఈ పూలు జలుబు, ఫ్లూ , ఇతర ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతాయి. ఆస్తమా, దగ్గు, ఆయాసం, శ్వాస కోస స‌మ‌స్య‌లు ఉన్నవారికి కూడా మునగ పువ్వు ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం. పప్పు లేదా ఏదైనా ఇతర కూరలలో తాలింపులు వేసేటప్పుడు మునగ పువ్వును వేసుకొని ఆహారంలో చేర్చుకుంటే ఈ పై సమస్యలకు చెక్ పెట్టవచ్చు.