ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదగడం సాధారణ విషయం కాదు. అయితే మొదట మోడల్ గా రాణించిన కృతి సనన్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌హోదా సంపాదించుకుంది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన వన్.. నేనొక్కడినే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు టాలీవుడ్ పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కి చెకేసింది ఈ బ్యూటీ. అక్కడ వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్లు తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ స్టార్ బ్యూటీగా మారిపోయింది.
ఇక ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో సీత పాత్రకు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా.. నటనకు మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది కృతి. ఆమె ఓగ్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బయట వ్యక్తులకు కూడా సమాన అవకాశాలు ఉండాలని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్, ప్రొడ్యూసర్స్ వారసులకు ఎంట్రీకి వెంట వెంటనే అవకాశాలు వస్తాయని చెప్పింది.
కానీ ఎప్పుడు సొంత వాళ్లకే కాకుండా బయట వ్యక్తులకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందని.. టాలెంట్ ఉన్న వారిని కూడా ఇండస్ట్రీలో చోటు కల్పించాలని వెల్లడించింది. అలా కొత్తవారికి కూడా అవకాశాలు ఇవ్వడం వల్ల సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించింది. ఇక ఇటీవల కాలంలో అటువంటి పరిస్థితి మారిందని.. ప్రస్తుతం టాలెంట్ బట్టి కొత్తవారికి కూడా అవకాశాలు వస్తున్నాయని.. పెద్ద స్టార్స్ కంటే ప్రపంచం ఇప్పుడు ప్రతిభ ఉన్న వాళ్ళకి ఎక్కువగా సపోర్ట్‌ను ఇస్తుందని చెప్పుకొచ్చింది.