చిరంజీవి కుటుంబంతో గొడవలపై షాకింగ్ విషయాలు తెలిపిన రాజశేఖర్ శివాని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా పేరు పొందిన రాజశేఖర్ జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరి కుమార్తెలుగా శివాని రాజశేఖర్ కూడా టాలీవుడ్లో నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు దాటకుండా హీరోయిన్గా రాణిస్తోంది. అవసరమైతే కీలకమైన సినిమాలలో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోనే నటిస్తూ ఉంటుంది. తాజాగా ఈమె నటించిన చిత్రం కోట బొమ్మాలి.. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శివాని రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. రాజశేఖర్ కుటుంబానికి మెగా కుటుంబానికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి.. దీని గురించి మీడియా ప్రతినిధులు శివాని అడగక ఆమె ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.. శివాని రాజశేఖర్ నవ్వుతూ మాట్లాడుతూ లోపల బియ్యం గింజ అంత జరిగితే బయట బిర్యాని అంతగా చేస్తారంటే తెలిపింది.

అయితే కొన్ని వివాదాలు అయితే జరిగాయి కానీ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయని తెలిపింది. కానీ అవసరం అయినప్పుడు మాత్రం కచ్చితంగా అంతా కలిసి పోతాము మేమంతా ఒకే ఇండస్ట్రీలో ఉన్నాము.. కాబట్టి ప్రొఫెషనల్ వేరు పర్సనల్ వేరు గానే ఉంటుందని తెలిపింది. అయితే ఆ వివాదాలు అప్పుడు జరిగినప్పటికీ ఇప్పటికీ ఆ గొడవలు గురించి బయట వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు.. అంటూ ప్రశ్నించడం జరిగింది.. గతంలో ఎప్పుడో చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా వాళ్ల ప్రొడక్షన్లో నేను నటించకూడదని రూలేమీ లేదు కదా మా ప్రొడక్షన్లో వాళ్లు నటించకూడదని రూలేం లేదు సినిమా పరంగా అందరం ఒకటేగా ఆలోచిస్తామని తెలిపింది..ఎలాంటి గొడవలు జరిగిన తన సపోర్ట్ తన ఫ్యామిలీకే ఉంటుందని చెప్పేసింది శివాని రాజశేఖర్.