“వెళ్లి ఆ విషయం మీ అల్లు అర్జున్ ని అడగండి”.. హీరోయిన్ హన్సిక షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . రీసెంట్గా హీరోయిన్ హన్సిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి . హన్సిక టాలీవుడ్ ఇండస్ట్రీలో దేశముదురు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది . ఈ సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోతుంది అంటూ అంతా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అమ్మడుకు అసలు అంత సీన్ లేదు అంటూ తెలుగు జనాలు తేల్చేశారు.

కోలీవుడ్ లో మాత్రం సూపర్ స్టార్ హీరోయిన్గా రాజ్యమేలుస్తుంది . కాగా రీసెంట్గా తెలుగులో మై నేమ్ ఈజ్ శ్రుతి అనే సినిమాను చేస్తుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న హన్సిక ని మీడియా రిపోర్టర్లు పలు ప్రశ్నలు వేశారు. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ “మీరు ఎందుకు అల్లు అర్జున్ తో రెండో సినిమా నటించలేదు ..? దేశముదురు తర్వాత మళ్లీ మీరు ఎందుకు జతకట్టలేదు..? ఫ్యూచర్లో మీ కాంబోను ఎక్స్పెక్ట్ చేయొచ్చా ..?” అంటూ ప్రశ్నించారు .

దీనికి మనసులోని ఆన్సర్ ని ఇచ్చేస్తూ హన్సిక ..”వెళ్లి మీరు అల్లు అర్జున్ ని అడగండి..?” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అక్కడ ఉండే జనాలు సైతం షాక్ అయ్యారు . వేరే ఏ ఆన్సర్ ఇచ్చినా ఇది ఇంత పెద్ద వైరల్ అయ్యేది కాదు .. హన్సిక అలా పుసుక్కని అల్లు అర్జున్ ని అడగండి అనేసరికి అంటే బన్నీ ఆమెకు అవకాశాలు ఇవ్వట్లేదా ..? అన్న కోణంలో ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు . ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!