త‌ల్లి ఒడిలో కూర్చుని ఫోటోకు క్యూట్ గా ఫోజిస్తున్న చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. సౌత్‌లోనే స్టార్ హీరోయిన్‌!

పైన ఫోటోలో ఓ స్టార్ స్టార్ హీరోయిన్ ఉంది.. గుర్తు ప‌ట్టారా..? త‌ల్లి ఒడిలో కూర్చుని ఫోటోకు క్యూట్ గా ఫోజిస్తున్న ఈ చిన్నారి ఒక తెలుగు సినిమాతో వెండితెర‌పై అడుగు పెట్టింది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హోదాను ద‌క్కించుకుంది. హీరోల‌తో స‌మానంగా ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది. సౌత్ లోనే హైయ్యెప్ట్ పెయిడ్ యాక్ట్ర‌స్ గా పేరు తెచ్చుకుంది.

ఇప్ప‌టికైనా ఆమె ఎవ‌రో మీకు తెలిసిందా.. మ‌న అనుష్క శెట్టినే అండీ. బెంగ‌ళూరుకు చెందిను అనుష్క శెట్టి.. యోగా టీచ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత నాగార్జున హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన సూప‌ర్ మూవీతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చింది. విక్రమార్కుడు మూవీతో అనుష్క‌కు ఫ‌స్ట్ బ్రేక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోల‌తో జ‌త‌క‌డుతూనే.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో అల‌రించింది.

భాగ‌మ‌తి త‌ర్వాత సినిమాల‌ ఎంపికలో వేగం త‌గ్గించినా.. మ‌ళ్లీ ఇప్పుడు వ‌రుస ప్రాజెక్ట్ ల‌ను లైన్ లో పెట్టింది. ఇటీవ‌లె మిస్ శెట్టి.. మిస్ట‌ర్ పోలిశెట్టి మూవీతో ఓ మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో ఓ హ‌ర్ర‌ర్ థ్రిల‌ర్ మూవీలో న‌టిస్తోంది. అలాగే తెలుగులో చిరంజీవికి జోడీగా `మెగా156`లో అనుష్క యాక్ట్ చేయ‌బోతోంద‌ని టాక్ న‌డుస్తోంది.