యూట్యూబ్ ని దంచికొడుతున్న గుంటూరు కారం “దమ్ మసాలా”.. మహేశ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. అప్పుడెప్పుడో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కి ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో మనం చూస్తూనే వచ్చాం . ఆ తర్వాత సినిమాలో నటించిన నటీనటుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా కూడా కొన్ని రోజులపాటు సినిమా పోస్ట్ పోన్ అయింది . ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుల మధ్య మాటలు కారణంగా మరికొన్నాళ్ల పాటు సినిమా షూట్ ఆగిపోయింది.

అలా అలా ముక్కి మూలిగి ఎలాగోలా ఈ సినిమాకు సంబంధించిన షూట్ ను కంప్లీట్ చేసుకున్నారు. ప్రెసెంట్ డబ్బింగ్ పనుల్లో బిజీబిజీగా ఉంది గుంటూరు కారం టీం . రీసెంట్గా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఓ రేంజ్ లో ఈ పాటను డిజైన్ చేయాలి అనుకున్నాడు తమన్. అయితే పాట రిలీజ్ అయిన తర్వాత పాట కు అంత సీన్ లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది .

లిరిక్స్ పరంగా ఓకే కానీ మ్యూజిక్ పరంగా అంత హై రేంజ్ అందుకోలేకపోయాడు అంటూ మహేష్ అభిమానులు కామెంట్స్ చేశారు . అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఈ పాటకు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు . రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 20 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకొని టాలీవుడ్ లో ఫస్ట్ అత్యధిక వ్యూస్ అందుకున్న పాటగా గుంటూరు కారంలోని దమ్ మసాల సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది . టాక్ యావరేజ్ గానే దక్కించుకున్న వ్యూస్ మాత్రం దంచి కొట్టే రేంజ్ లో దక్కించుకునింది. ఈ క్రమంలోనే మహేష్ బాబు స్టామినా.. రేంజ్ ఇదే అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . మొత్తానికి టాక్ అటూ ఇటూ ఉన్న యూట్యూబ్లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో గుంటూరు కారం “దమ్ మసాలా” దూసుకుపోతుంది . చూద్దాం ఈ రికార్డ్స్ దూకుడికి బ్రేక్ ఎప్పుడు పడుతుందో..?