– ఇప్పుడు గెస్ట్లుగా యానిమల్ టీం రాబోతున్నారంటూ న్యూస్ వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఈ షోకు హాజరయ్యే అవకాశం ఉందట. యానిమల్ మూవీ తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా వీరు అష్టాపబుల్ షోకు గెస్ట్లుగా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక రణ్‌బీర్, రష్మిక, సందీప్ ముగ్గురు కలిసి వచ్చే ఎపిసోడ్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుందట. నవంబర్ లాస్ట్ వీక్ లో ఈ ఎపిసోడ్ ను ప్లే చేస్తారట.
ఇక అన్‌స్టాపబుల్ షో కి హాజరుకానున్న ఫస్ట్ బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ అవుతారు. యానిమల్ మూవీ డిసెంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీకి అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ గా దర్శకత్వం వహిస్తున్నాడు. రణ్‌బీర్ ఫాదర్ క్యారెక్టర్ లో అనిల్ కపూర్ నటిస్తుండగా, విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో బాబిడియాలో నటిస్తున్నారు. టి సిరీస్ బ్యానర్ పై దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో సందీప్ వంగా యానిమల్ మూవీని నిర్మించాడు.
కాగా మొదట్లో ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ కావడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ కి జంటగా పరిణీతి చోప్రాను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ ప్రాబ్లమ్‌తో పరిణితి ప్లేస్ లోకి రష్మిక మందన వచ్చింది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో హిందీలోనే కాక సౌత్ లోను రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేశాయి. అర్జున్ రెడ్డిని మించిన సినిమా ఉండబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది.