ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్య గురించి ఈ షాకింగ్ నిజాలు మీకు తెలుసా..?

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్‌గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ అప్పుడే హాఫ్ సెంచరీ(50 ఏళ్ళు) కంప్లీట్ చేసిందంటే మీరు నమ్ముతారా.. మోడల్గా, యాక్టర్ గా రాణించింది. సినీ రంగంలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బ‌చ్చన్‌ కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టి అభిషేకి భార్యగా, అమితాబ్ కి కోడలిగా, ఆరాద్య‌కి అమ్మగా ఎంతో నిబద్ధత తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. నవంబర్ 1న పుట్టిన ఈ ప్రపంచ సుందరి స్వగ్రామం ఏది.. మోడలింగ్ లోకి ఎలా వచ్చింది.. మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎప్పుడు ద‌క్కించుకుంది. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చింది.. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి చూద్దాం. కర్ణాటకలోని మంగుళూర్‌లో ఐశ్వర్య రాయి పుట్టింది.

ఈమె ఫ్యామిలి అంతా ‘తులు’ లాంగ్వేజ్ లోనే మాట్లాడుతారు. ఐశ్వర్యకి ఒక సోద‌రుడు (అన్న‌య్య‌) ఉన్నారు. చిన్నప్పుట్టి నుంచే ఐశ్వర్యకి క్లాసికల్ డ్యాన్స్, మ్యూజిక్ పై ప‌ట్టు ఉంది. మెడిసిన్ చదువుదాం అనుకున్న ఐశ్వర్య ఆర్కిటెక్ట్ వైపు ఇంట్ర‌స్ట్‌తో ఆ కాలేజీలో జాయిన్ అయ్యింది. ఇక అక్కడ చదువుతున్న టైంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.ఈ నేప‌ద్యంలో కొన్ని టీవీ యాడ్స్ లో నటించింది. అలాగే మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ ప్లేస్ ద‌క్కించుకుంది. ఆ తరువాత 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ విశ్వసుందరిగా గెలిచింది. ఇక అప్ప‌టి నుంచి సినిమా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.

ఈక్రమంలోనే 1997లో మణిరత్నం రూపొందించిన‌ ‘ఇద్దరు’ (ఇరువర్) సినిమాతో ఇండ‌స్ట్రికి ఎంట్రి ఇచ్చింది. ఆ వెంటనే హిందీ సినిమాలో కూడా అవకాశం వ‌చ్చింది. కానీ మొదట్లో న‌టించిన‌ సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. 1998లో శంకర్ దర్శకత్వంలో ‘జీన్స్’ సినిమాలో నటించి మొదటి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ప్రపంచ వింత‌ల‌నింటిని చూపిస్తూ ఐశ్వ‌ర్య‌ పై శంకర్ పాటలు రూపొందిస్తే.. ప్రేక్షకులకు ప్రపంచ వింతలు చూడాలా..? ఐశ్వర్య రాయ్‌ని చూడాలా..? అనే క‌న్‌ఫ్యూజ‌న్‌లో పడ్డారు.

అక్కడ మొదలైన సినీ జ‌ర్ని ఇక్కడి వరకు చేరుకుంది. ఇక పెళ్లి జీవితానికి వస్తే.. సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసిన ఐశ్వర్య కొన్నాళ్ల తరువాత అతడితో వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్ద‌ల కార‌ణంగా విడిపోయింది. ఆ తరువాత ధూమ్2 మూవీ షూటింగ్ టైములో అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐశ్వర్య.. 2007 జనవరి 14న నిశ్చితార్ధం చేసుకొని 2007 ఏప్రిల్ 20న అభిషేక్‌ను పుళ్ళాడింది. 2011లో నవంబర్ 16న ఈ జంట‌ ఆరాధ్యకి జ‌న్మ‌నిచ్చారు. .