ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి, బాలయ్య వరుసగా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా రీఎంట్రీలో ఏకధాటిగా చిరంజీవి సినిమాలు చేస్తున్నాడు. కానీ ఆశించిన స్థాయిలో సినిమాలు మాత్రం హిట్ కావడం లేదు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మాత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని పొంగల్ విన్నర్‌గా నిలిచింది.
ఇటీవలే ఈ సినిమా జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా దసరా సందర్భంగా ప్రసారమైంది. కానీ బుల్లితెర ప్రేక్షకుల్లో స్పందన అంతగా రాలేదు. దీంతో అర్బన్ ఏరియాలో 5.14,అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 4.56 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. అయితే బాలయ్య హీరోగా వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ మూవీకి మాత్రం ఏకంగా 8.83 టీఆర్పీ రేటింగ్‌ను సాధించింది. ఈ రికార్డును మాత్రం చిరంజీవి సినిమా చేరలేకపోయింది. దీంతో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య టీఆర్పీ రేటింగ్స్ ను పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
కాగా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. ఈ సినిమాలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా నటించారు. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక వీరసింహారెడ్డి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు. శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్స్ గా నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి స్టార్లు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా వసూళ్ల పరంగా రూ. 135 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది.