“ఏం పీకడానికి ఓటు వేయాలి..?”.. బ్రహ్మి మాస్ ఆన్సర్ కి కింద పడి దొర్లాల్సిందే(Video)..!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పోలింగ్ అక్కడక్కడ ఘర్షణలతో అక్కడక్కడ గొడవలతో ప్రశాంతంగా ముగిసింది . అయితే ఎవరు ఊహించని విధంగా అతి తక్కువ శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఇప్పుడు హార్ట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వర్షం పడుతున్న కారణంగా ఓటు వేయడానికి రాలేదో.. లేకపోతే ఓటు వేస్తే ఏం లాభం .. ఎలాగైనా వచ్చే వాళ్ళు వస్తారుగా ఏదో ఒకటి చేస్తారుగా అనుకున్నారో.. చాలామంది ఓటు వేయలేదు.

హైదరాబాద్ లాంటి సిటీలో కేవలం 20 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే స్టార్ సెలబ్రెటీస్ మాత్రం ఈసారి ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . యాక్టర్ బ్రహ్మానందం కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు . ఈ క్రమంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నాక మీడియాతో మాట్లాడుతూ..” ఓటు వేయని వాళ్ళని మీరు ఏమంటారు సార్ …?” అని ప్రశ్నించగా..

” ఏమంటారు..ఓటు వేయని వాళ్ళు అంటారు” అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ వేశాడు . దీంతో అక్కడే ఉన్న జనాభా మీడియా రిపోర్టర్స్ కూడా నవ్వుతారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. కొంతమంది బ్రహ్మీ చెప్పింది కరెక్ట్ ..ఓటు వేయకపోతే ఏమవుతుంది ..ఒక్క ఓటు లాస్ అవుతుంది అంటుంటే .. మరికొందరు ఏం పీకడానికి ఓటు వేయాలి .. వాళ్ళు అనుకున్నదే చేస్తారు .. మనం కష్టపడి ఓటు వేసిన ఎవరు గెలవాలో వాళ్లే ముందుగా ఫిక్స్ చేసుకుంటారు .. ఇంకెందుకు ఓటు వేయడం అంటున్నారు. అయితే ఇదంతా తప్పని బాధ్యతగల సిటిజన్స్ ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కొంతమంది పెద్ద మనుషులు చెప్తున్నారు..!!