ఈ ఏడాదిలో ఇప్పటికే చాలామంది టాలీవుడ్ యంగ్ హీరోస్, సెలబ్రిటీస్ జీవితంలోకి అడుగు పెట్టి ఓ ఇంటి వారు అయిపోయారు. ఇక ఇటీవల సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా జరిగింది. కాగా తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట ర్వరలోనే పెళ్లి భాజలు మూగబోతున్నాయి. నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా నిర్మాణ రంగంలో ఉన్న సంగతి తెలిసిందే.
దిల్ రాజుకు కుమారుడు లేకపోవడంతో తన వారసుడుగా శిరీష్ కొడుకు ఆశిష్‌ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశాడు. ఆశిష్.. రౌడీ బాయ్స్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే సెల్ఫిష్ అనే మరో సినిమాతో రాబోతున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు ఆశిష్. మూడో సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు ఈలోపే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడానికి రెడీ అయిపోయాడు. ఏపీకి చెందిన ఓ వ్యాపార కూతురు అద్విత రెడ్డితో.. ఆశిష్ నిశ్చితార్థం గ్రాండ్ లెవెల్లో జరిగింది. చాలా సైలెంట్‌గా ఆశిష్ – అద్విత ఎంగేజ్మెంట్ ను పూర్తి చేశారు. ఎటువంటి హడవిడిలేకుండా ఈ ఎంగేజ్మెంట్ జరిగిపోయింది.
అయితే ఈ ఎంగేజ్మెంట్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక చాలామంది ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి వివాహం జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల దిల్ రాజు ఇంట్లో విషాదం జరిగిన సంగతి తెలిసిందే. విషాదం జరిగిన ఇంట్లో సంవత్సరంలోపు శుభకార్యం జరిగితే మంచిదంటారు. అందుకే ఈ కుటుంబ ఆశీష్ వివాహాన్ని ఇంత సడన్గా ప్లాన్ చేశారని తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన దిల్ రాజు తర్వాత నిర్మాతగా మారి.. తను చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకని స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు దిల్ రాజు.