అక్కడ ” యానిమల్ ” సినిమాకి భారీ షాక్‌…!!

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా.. యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఈ సినిమాని సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలలో అనిల్ కపూర్, పృధ్విరాజ్, బాబీ డియోల్ నటించారు.

భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా… ఈరోజు (డిసెంబర్ 1 ) థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలో యానిమల్ కి ఓ రేంజ్ లో టికెట్ ప్రీ బుకింగ్స్ జరుగుతుండగా… ఒక్క కేరళలో మాత్రం యానిమల్ కి ఒకింత పూర్ బుకింగ్స్ లభిస్తున్నట్లు తెలుస్తుంది.

అక్కడక్కడ కొన్ని ప్రధాన మల్టి ప్లెక్స్ లలో తప్ప కొన్ని ఏరియాలలో అస్సలు బుకింగ్స్ జరగడం లేనట్టు సమాచారం. ఈరోజు అక్కడ కొన్ని మలయాల్ సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా యానిమల్ కి దెబ్బడిందనే చెప్పాలి. ఇక ఈరోజు యానిమల్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే… కేరళ లో కూడా కలెక్షన్స్ మొదలవడం పక్క.