వైష్ణవ్ తేజ్ ” ఆది కేశవ ” 6 డేస్ కలెక్షన్స్…?!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ” ఆది కేశవ “. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాని… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అలాగే జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు టోటల్ సినిమాలోనే బ్లాక్ బస్టర్ అయ్యాయి.

ఇక ” సిత్తరాల సిత్రావతి ” పాట మారుమోగుతుంది. ఇక టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను.. ముఖ్యంగా మాస్ అభిమానులని ఆకట్టుకున్నాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక దీంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రిజిస్టర్ కావడం లేదు.

ఇక ఈ సినిమా 6 డేస్ కలెక్షన్స్ ని చూస్తే… ఈ సినిమాకి రూ.8.85 కోట్లు థియేట్రికల్ బిజినెస్ రాబట్టింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలంటే రూ.9.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆరు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ. 2.43 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక బ్రేక్ ఈవెన్ కి రూ.6.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.