యానిమల్ ప్రీమియర్ షో టాక్ రివ్యూ..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెర‌కెక్కిన మూవీ యానిమల్. రష్మిక మందన హీరోయిన్గా అనిల్ కపూర్ కీలక పాత్రలో, బాబిడియాలో విలన్ రోల్ ను ప్లే చేసిన ఈ సినిమా డిసెంబర్ 1న (ఈ రోజు) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రిలీజ్‌కి ముందే ఓ తెలుగు హీరో సినిమాకు ఉన్నంత హైప్‌ ఈ సినిమాపై ఏర్పడింది. ఇక కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీమియర్ టాక్ పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయినఈ మూవీ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతుంది.

ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో అయితే రికార్డ్ స్థాయిలో టికెట్స్ బుక్ అయ్యాయి ఆకాశానికి చేరిన ఈ అంచనాలను రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి అందుకున్నారా..? సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? లేదా..? రివ్యూ ఏ విధంగా ఉందో..? ఒకసారి చూద్దాం. ఈ మూవీ ఓ రివెంజ్ గ్యాంగ్‌స్ట‌ర్‌ డ్రామా అని సమాచారం. తండ్రి అనిల్ కపూర్‌ని అమితంగా ప్రేమించే కొడుకు పాత్రలో ర‌ణ్‌బీర్‌ కపూర్ కనిపిస్తాడు. అనిల్ కపూర్ చావుకు కారణమైన వాళ్లను రణ్‌బీర్ మట్టి పెడతానని శబ్దం చేస్తాడు. త‌ర్వాత యానిమల్‌గా రణ్‌బీర్ మనస్తత్వం ఎలా ఉంటుంది, ఫ్యామిలీ మెన్ గా, గ్యాంగ్‌స్ట‌ర్ గా అతని జర్నీ ఎలా కొనసాగుతుంది అనేదే ప్రధాన కథాంశం.

సినిమా ప్రారంభంలోనే ట్విస్టులు, టర్న‌లు ఆశ‌క్తి క‌ల్పిస్తాయ‌ట‌. రణ్‌బీర్ కపూర్ ఎంట్రీ హైలెట్ అంటున్నారు. ఆయన కనిపించే ప్రతి సన్నివేశం చాలా వైలెంట్ గా సిల్వర్ స్క్రీన్ పై పేలిందట. ర‌ణ్‌బీర్‌ కపూర్ కెరీర్ లో ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన‌డంలో సందేహం లేదని ప్రీమియర్ టాక్ ఆడియన్స్ రివ్యూ. తండ్రి, కొడుకు.. భార్యా,భర్తల మధ్య ఉన్న రిలేషన్ షిప్స్, ఎమోషన్స్ ను చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేశాడట సందీప్ రెడ్డి. లోతైన సన్నివేశాలు గుండెకు హత్తుకుంటాయని చెబుతున్నారు. బీభత్సమైన వైలెన్స్ మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్ జోడించడం లో వంగ పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్తున్నారు ప్రేక్షకులు.

అనిల్ కపూర్, ర‌ణ్‌బీర్‌ కపూర్ మధ్యన జరిగే సీన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. స్కూల్ పిల్లాడి నుంచి కాలేజ్ అబ్బాయి, లవర్ బాయ్, గ్యాంగ్ స్టార్ అలా హీరో జీవితానికి సంబంధించిన అన్ని దశలు ఈ సినిమాలో క్లియర్ కట్ గా చూపించారు. సందీప్ రెడ్డి వంగ చెప్పినట్లుగానే మూడున్నర గంటల సినిమాలో ఎక్కడా ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వలేదట. ఇక‌ ఈ సినిమాకు ఓన్లీ ఫర్ అడల్ట్ సర్టిఫికెట్ వచ్చిన సంగతి తెలిసిందే. వైలెన్స్, రొమాన్స్, ఫుల్ లాంగ్వేజ్ లిమిట్స్ కు మించి ఉండడంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్.

ఇక ర‌ణ్‌బీర్‌ కపూర్, బాబి డియోలో మధ్యలో ఉండే ఆధిపత్య పోరు ఓ రేంజ్ లో ఉంటుందని.. సందీప్ రెడ్డి దానిని బాగా చూపించాడు అని చెప్తున్నారు. ఇక ఫైనల్ ఫేస్ అదరగొడుతుందట. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ అని సన్నివేశాలకు ప్రాణం పోసిందని చెప్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా హర్షవర్ధన్ రామేశ్వరన్‌ వ్యవహరించాడు. ఇక సినిమా అయిపోక ముందు క్రెడిట్స్ పడేటప్పుడు ఓసర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. అది కచ్చితంగా ధియేటర్ కు వెళ్లే చూడాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా యానిమల్ మూవీ ప్రీమియర్ టాక్‌ తో పాజిటివ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. పూర్తి రివ్యూ వస్తే కానీ యానిమల్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో తెలియదు.