గుట్టు చప్పుడు కాకుండా ” సలార్ ” ట్రైల‌ర్‌ లాంచ్.. నిరాశ వ్య‌క్తంచేస్తున్న ఫ్యాన్స్ ..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా 2023 డిసెంబర్ 22న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూశారు.

ప్రతి సినిమాకి కూడా ట్రైలర్ లాంచ్ చేసేటప్పుడు… ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటూ ప్రమోట్ చేసుకుంటారు. కానీ ఈ సినిమాకి మాత్రం ఎటువంటి హడావిడి, ఈవెంట్స్ లేకుండా.. రాత్రి 7:19 గంటలకి విడుదల చేసేసారు. ఇక ఈ విధంగా ట్రైలర్ ను రిలీజ్ చేయడం.. కారణంగా ప్రభాస్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

చిన్న సినిమా అయినా ట్రైలర్ ఈవెంట్ మాత్రం తప్పకుండా పెట్టుకుంటారు.. కానీ ఈ పాన్ ఇండియా సినిమాకి ట్రైలర్ ఈవెంట్ ఎందుకు పెట్టలేదు? అసలు దీని వెనకున్న రహస్యం ఏంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ట్రైలర్ మాత్రం గట్టి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది అని భావిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ ట్రైలర్ వెనుక ఉన్న రహస్యం ఏంటో బయట పడాల్సి ఉంది.