యానిమల్ మూవీ ట్విట‌ర్ రివ్యూ.. ప‌క్క బ్లాక్ బాస్ట‌ర్ రాసిపెట్టుకోండి..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ హైప్‌ నెలకొంది. ఇక డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షో ముగియడంతో ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా తో సందీప్ రెడ్డి, రణ్‌బీర్ కపూర్ తమ అంచనాలను అందుకున్నారో లేదో ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

తండ్రి పై అమిత‌మైన‌ ప్రేమను పెంచుకున్న ఓ కొడుకు తండ్రి చనిపోవడంతో ఇటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు ఎంత కృరంగా మారాడు. శత్రువు ఎలా చంపాడు, అనే అంశంతో సినిమాను తెర‌కెక్కించాడు సందీప్ రెడ్డి. ఈ సినిమాలో మంచి ఎమోషనల్ డ్రామా తో పాటు విపరీతమైన వైలెన్స్ మోతాదుకు తగ్గట్టు రణ్‌బీర్, రష్మిక మధ్య రొమాన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సీన్ సినిమాకు బాగా హైలైట్ అయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ జనాలు ఏ విధంగా చెప్పారంటే.

ఈ సినిమా పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. మరి ముఖ్యంగా అందరూ అనుకున్నట్టుగానే రన్ టైం గురించి చాలామంది ఆడియన్స్‌లో భయం ఉంది. మూడు గంటల సినిమా అంటే బోర్ కొడుతుందేమో ఎలా కూర్చుంటాము అంటూ ఫీలైన ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత.. ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎప్పుడు అయిపోయిందో.. కూడా తెలియలేదు అంటూ కామెంట్ చేశారు. నిజంగా యానిమల్ మూవీ సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరో ట్విట్టర్ రివ్యూ లో ఫుల్ రేటింగ్ ఇచ్చేసిన ఆడియన్స్ ప్రీమియర్ షో చూసా పక్క బ్లాక్ బాస్టర్.

బాలీవుడ్ పాన్ ఇండియన్ బ్లాక్ బాస్టర్ గా నిలవబోతోంది అంటూ కామెంట్స్ చేశారు. కథ‌, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, రణ్‌బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ అన్ని ఈ సినిమాకు హైలెట్స్. మైనస్ అని చెప్పుకోవడానికి ఈ సినిమాలో ఏమీ లేదు అంటూ కామెంట్ చేశారు. మరొక ట్విట్ లో యానిమల్ మూవీ తో పోలిస్తే అర్జున్ రెడ్డి పర్ఫామెన్స్ డిజాస్టర్ గా చూడాలి. ఈ సినిమాలో సందీప్ కథను తీర్చిదిద్దిన విధానం వేరే లెవెల్ లో ఉంది అంటూ ట్విట్ చేశారు.

ఇక ప్రీమియర్ ను చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుంది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. రణ్‌బీర్ కపూర్ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాల్లో ఇచ్చాడని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా అందరూ పాజిటివ్ రివ్యూను ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగాల పర్ఫామెన్స్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. అయితే హీరోయిన్ రష్మిక మందన, రణ్‌బీర్ కపూర్ ఫాదర్ అనిల్ కపూర్ పాత్రులపై ఎటువంటి రివ్యూస్ రాలేదు.