ఓవర్సీస్ లో యానిమల్ మేనియా షురూ.. యూఎస్ లేటెస్ట్ క‌లక్ష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..?

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ యానిమల్. రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ లోను మంచి హైప్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కింది.

తండ్రి పై అమితమైన ప్రేమను పెంచుకున్న కొడుకు.. తండ్రి చనిపోవడంతో ఎలా వైలెంట్‌గా మారాడు అనే అంశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడట సందీఈప్ రెడ్డి. ఈ సినిమాల్లో రణ్‌బీర్‌, రష్మిక మధ్యన సాగే రొమాంటిక్ సీన్స్ కూడా హైలెట్గా తెలుస్తుంది. ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం యూఎస్ లో ఈ సినిమా నెవర్ బిఫోర్ ఓపెనింగ్స్‌ను సొంతం చేసుకుంది. అనుకున్న దానికన్నా యూఎస్‌లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిందట. లేటెస్ట్గా ఈ సినిమా ఏకంగా వన్ మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసింది.

బాలీవుడ్ సినిమాల్లో ద ఫాస్టెస్ట్ వన్ మిలియన్ గ్రాస‌ర్‌గా ఈ సినిమా నిలిచింది. దీనిని యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ అధికారికంగా ప్రకటించారు. డే వన్ కి కంప్లీట్ గా ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను వసూలు చేస్తుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాను టి సిరీస్, భద్రకాళి పిక్చర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. డిసెంబ‌ర్ 1(ఈ రోజు) ఈ మూవీ పాన్ ఇండియా లెవ‌ల్‌లో రిలీజై ప్రిమ‌య‌ర్‌షోతో పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది.