పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ పూజా.. వ‌రుడు ఎవరంటే…!!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లపై మొగ్గు చూపుతూ మూడు ముళ్ళు బంధంతో ఒక ఇంటి వారు అవుతున్నారు. ఈ సినీ సెలబ్రిటీలను ఏ దేవుడు కరుణించాడో కానీ… వరుసగా పెళ్లి బాజాలు మోగిస్తానే ఉన్నారు. ఈ క్రమంలోనే మరో బ్యూటీ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.

ఆమె మరెవరో కాదు కన్నడ నటి పూజ గాంధీ. 2002లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ …” దండుపాళ్యం” అనే సినిమాతో అందరిని ఆకర్షించింది. కన్నడ, హిందీలో కూడా పలు సినిమాలలో నటించిన పూజ.. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

ఇక ఈమె సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఈమెకు కన్నడ భాష నేర్పించిన వ్యక్తి విజయ్. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక ఈ ప్రేమ పక్షులు పెద్దల అంగీకారంతో ఒకటవ బోతున్నారు. ఇక పెళ్లెప్పుడు? ఎక్కడ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.