Bigg Boss: అమర్ దీప్‌కు అస్వస్థత.. హౌస్ నుంచి బయటకి..

ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 7 ర‌స‌వతరంగ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మునుపటి సీజన్ల కన్నా ఈ సీజన్ మరింత ఆసక్తిగా కొనసాగుతుంది. కొత్త కంటెంట్ అందిస్తూ బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇక ఇదే హౌస్ లో సీరియల్ హీరో అమర్‌దీప్‌ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. తాజాగా జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో అమర్‌దీప్‌కు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లు తెలుస్తుంది. నిన్నటి టాస్క్ లో అద్భుతంగా పెర్ఫాం చేశాడు అమర్.

ఇక ఈ వారం బిగ్బాస్ హౌస్లో ఇన్వెస్టిగేషన్ టాస్క్ నడుస్తుంది. ఇందులో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా అమర్ పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమర ఒకసారిగా అనారోగ్యం పాలు అయ్యాడట. ప్రస్తుతం బిగ్బాస్ మెడికల్ రూంలో అమర్ కు ట్రీట్మెంట్ జరుగుతుందని తెలుస్తుంది.

ఆయనకు సిలైన్ కూడా ఎక్కిస్తున్నారట. అయితే అతను హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని న్యూస్ వైరల్ అవుతుంది. అమర్‌ ఆరోగ్యం కుదుటపడకపోతే బయటకు పంపిస్తారని టాక్. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ నుంచి అఫీషియల్ అనైన్స్‌మెంట్‌ రాలేదు. దీంతో ఈ న్యూస్‌లో నిజం ఎంతుందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.