సూర్య ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. షూటింగ్లో ప్రమాదం..!!

తమిళ స్టార్ హీరో సూర్య కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉండే సూర్య ఇటీవలే కంగువ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.దీంతో సూర్యకు గాయాలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. వెంటనే చిత్ర బృందం అప్రమత్తమయి గాయపడిన సూర్యను దగ్గరలో ఉండే ఆసుపత్రికి సైతం తరలించారు.

చెన్నైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్లో ఒక సన్నివేశం చిత్రీకరిస్తూ ఉండగా కెమెరా ఆయన మీద పడిపోయిందని సమాచారం..కెమెరా మీద పడడంతో సూర్య భుజానికే సైతం గాయమైనట్లుగా తమిళ మీడియా నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. సూర్యకు కోలీవుడ్ టాలీవుడ్ లో మంచి మార్కెటింగ్ ఉన్నది. తన చిత్రాలను సైతం తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేస్తూ ఉంటారు యాక్షన్ డైరెక్టర్గా పేరు సంపాదించిన శివ కంగువా సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.

హిస్టారికల్ స్టోరీ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని హీరోయిన్గా నటిస్తున్నది. అలాగే ఈ సినిమా ఏకంగా 38 భాషలలో విడుదల చేస్తున్నారు. సూర్య గాయాల పాలు అయ్యారని తెలిసి అభిమానుల సైతం చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ సూర్య ఆరోగ్యం బాగుందని వైద్యుల సైతం సమాచారం తెలియగానే కాస్త ఊపిరి పీల్చుకున్నారు..కంగువ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి.