నందమూరి నటసింహం బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఎంతగానో దగ్గరయ్యాడు. ఇప్పటికే ఈ షో ద్వారా ఎంతో మంది రాజకీయ నాయకులను, సినీ సెలబ్రిటీలను ఆహ్వానించి వారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు. అంతేకాదు వారి గురించి తెలియని విషయాలు కూడా వారి నోటితోనే చెప్పించాడు బాలయ్య. ఇక హీరో, హీరోయిన్లు అయితే వారి లవ్ ఎఫైర్లు, మిగతా కుటుంబానికి సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా బయటకు రప్పించాడు. అయితే తాజాగా అన్‌స్టాపబుల్‌షొకి యానిమల్ మూవీ ప్రమోషన్స్ కోసం రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన, సందీప్ రెడ్డి వంగలు రాబోతున్నారు.
ఈ షోలో బాలకృష్ణ సాక్షిగా రష్మిక – విజయ్ దేవరకొండ ప్రేమ వ్యవహారం బయటపడబోతుందని సమాచారం. దానికి ప్రధాన కారణం ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల విషయంలో బాలకృష్ణ వారి మనసులో ఉన్న విషయాలను కూడా బయటపెట్టించటమే. అయితే ఈ షోలో విజయ్ దేవరకొండ కి ఫోన్ కాల్ చేయించి వారి మధ్యన ఉన్న ప్రేమ విషయాన్ని బయట పెట్టబోతున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సరదాగా విజయ్ దేవరకొండ కి ఫోన్ చేయించి మెల్లమెల్లగా అసలు మేటర్ ను బయట పెట్టబోతున్నాడట బాలయ్య.
ఒకవేళ ఇదే జరిగితే ఈ ఎపిసోడ్ సీజన్‌లో హైలెట్ గా మారుతుంది. సీజన్ పై మరింత హైప్ పెరుగుతుంది.ఇక గత సీజన్ లో కూడా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్న రష్మిక రచ్చ రచ్చ చేసి షోపై మంచి హైప్ తెచ్చింది. ఈ సీజన్ అంతకుమించి ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ వార్తల నిజమెంతుందో తెలియదు కానీ కేవలం షోను హైలెట్ చేసేందుకు ఆ ఓటీటీకి డబ్బులు సంపాదించి పెట్టేందుకే కొందరు కావాలని ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారంటూ.. నెట్టిజన్లు ఫైర్ అవుతున్నారు.