“పిల్లలు పుట్టిన తరువాత ఆ పని చేయడం మానేశా”..ఇంత ఓపెన్ గా చెప్పేశావ్ ఏంటి బన్నీ ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ రీసెంట్ గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు .

 

ఇదే క్రమంలో హోస్ట్ నుంచి “తండ్రిగా ప్రమోట్ అయిన తర్వాత మీలో వచ్చిన భారీ మార్పు ఏంటి ..?” అని ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు . “పెళ్లికాకముందు నాకు ఇష్టం వచ్చినట్లు ఉండేవాడిని ..ఏదైనా తినేవాడిని ఏదైనా మాట్లాడేవాడిని .. ఎలా అయినా ఉండేవాడిని .. నా నోటి వెంట బూతు పదాలు కూడా కొంచెం ఎక్కువగానే వచ్చేవి “..

“అయితే పెళ్లి తర్వాత పిల్లలు ..పుట్టాక నా టంగ్ టోటల్ కంట్రోల్లోకి వచ్చేసింది. అసలు బూతు మాటలు మాట్లాడటం లేదు. ఇంట్లో కూడా ఎలా అంటే అలా ఉండను నన్ను చూసి నా పిల్లలు నేర్చుకుంటారు ..అందుకే నేను పద్ధతిగా ఉంటేనే నా పిల్లలు కూడా పద్ధతిగా పెరుగుతారు.. పద్ధతిగా ఉంటారు అని నమ్ముతున్నాను “అంటూ సంచలన కామెంట్స్ చేశాడు అల్లు అర్జున్ . ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!