ఎన్నారైలను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ బ్యూటీల లిస్ట్ ఇదే..

అమెరికా మ్యాచెలు అంటే అందులోనూ ఎన్నారై లను పెళ్లి చేసుకోవాలంటే సాధారణ అమ్మాయిలే కాదు సినిమా హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కెరీర్ తర్వాత హ్యాపీగా విదేశాల్లో సెటిల్ అవ్వచ్చని భావిస్తారు. అలా మన టాలీవుడ్‌కి చెందిన ఎంతోమంది ముద్దుగుమ్మలు విదేశాలకు చెందిన వారినే పెళ్లాడి అక్కడే సెట్టిల్‌ అయ్యారు. అలా పెళ్లాడిన వాళ్లు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

రంభ :


టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ.. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది. అప్పట్లో ఆమె అందానికి కుర్రాళ్లంతా ఫిదా అయ్యేవాళ్ళు. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా స్పెషల్ సాంగ్ లో నటించిన రంభ తన అందంతో మంచి మార్కులు కొట్టేసింది. ఇక రంభ‌ విజయవాడలో జన్మించింది. సినిమాలో హీరోయిన్గా రాణించిన రంభ కెనడాకు చెందిన ఇంద్రన్ అనే ఎన్ఆర్ఐని వివాహం చేసుకుంది.

గోపిక :


రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీలో మొదటి హీరోయిన్గా నటించిన గోపిక.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించిన మంచి సక్సెస్ అందుకోలేదు. ఇక అఖిలేష్ అనే ఓ ఫారినర్ ఎన్నారైని వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.

రాధిక ఆప్టే :


ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయమే. రక్త చరిత్ర సినిమాలో పరిటాల సునీత రోల్ ప్లే చేసిన ఈమె లెజెండ్ సినిమాలో బాలయ్యకు జంటగా నటించింది. హాట్ బ్యూటీగా క్రేజ్ ను సంపాదించుకున్న రాధిక లండన్ కు చెందిన బెండిక్ట్‌ టేలర్‌ను వివాహం చేసుకుంది.

ప్రీతిజింతా :


టాలీవుడ్ బ్యూటీ ప్రీతిజింతాకు పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు బాలీవుడ్ లోనే సినిమాల్లో నటించే స్టార్ హీరోయిన్గా క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రేమంటే ఇదేరా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. జీని గుడ్ ఇన‌ఫ్‌ ను వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్ అయిపోయింది. ఇక ప్రస్తుతం ఐపిఎల్ లో పంజాబ్ టీం ను నడిపిస్తుంది.

మీరాజాస్మిన్


కేరళ బ్యూటీ మీరజస్మిన్‌ తెలుగులో టాప్ హీరోయిన్గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. పక్కింటి అమ్మాయిల కనిపించే మీరా తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాల్లో నటించింది. రాజశేఖర్ సరసన గోరింటాకు సినిమాలో ఎమోషనల్ రోల్‌లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముంబైలో అనిల్ జాన్ అనే ఎన్నారై ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత న్యూజెర్సీలో సెటిలైంది. అయితే కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయారు.