” గాయం మానిన… డామేజ్ మాత్రం సర్దుకుపోలేదు ” మెగా అల్లుడు ఎమోషనల్ పోస్ట్…!!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మనందరికీ సుపరిచితమే. ఈమె కళ్యాణ్ దేవ్ నీ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీజ ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అనంతరం వీరికి ఓ కూతురు కూడా పుట్టింది.. ఇక ఏవో డిస్టబెన్స్ కారణంగా విడాకులు తీసుకుంది. ఇక అనంతరం చిరంజీవి ఇంటికి వచ్చేసింది శ్రీజ.

చిరంజీవి తన కూతురి బాధ చూడలేక కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి వివాహం చేశాడు. వీరిద్దరికీ కూడా ఓ కూతురు జన్మించింది. వీరిద్దరూ కూడా ఏవో గొడవలు కారణంగా కొద్దికాలం నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురిపై ప్రేమతో నవిష్కను అప్పుడప్పుడు తన వద్దకు తీసుకొచ్చుకుంటున్నాడు. అలాగే తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాడు.

తాజాగా కళ్యాణ్ దేవ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ” గాయం మానడం అంటే డ్యామేజ్ మొత్తం సర్దుకుపోయినట్లు కాదు.. డామేజ్ జీవితాన్ని ఇంకా కంట్రోల్ చేయలేదన్నదే దాని అర్థం ” అని ఓ కొటేషన్ షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజెన్లు శ్రీజ తో ఆయన గొడవలు సర్దుమనిగిపోయినట్టున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.