చలికాలంలో వచ్చే జలుబు, కఫం కు ఈ టీతో క్షణాల్లో చెక్..

ఆయాసం ఉన్నవారికి అయితే కోపం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. దీంతో తినేందుకు, తాగేందుకు ద‌గ్గడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ కఫాన్ని పోగొట్టడంలో లవంగాలు బాగా సహకరిస్తాయి. చలికాలం వచ్చే శ్వాసకోశ‌ ఇబ్బందులకు లవంగాలు ఎంతగానో తోడ్పడతాయి. మందులు ఎన్ని మింగిన సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఆయుర్వేదంలో లవంగాలను అనారోగ్య సమస్యలన్నీ తగ్గించే ఔషధంగా భావిస్తారు.

లవంగాలతో తయారు చేసే టీ తాగడం వల్ల కపాన్ని క్షణాల్లో తగ్గించవచ్చు. ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లు తీసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించిన తర్వాత ఇప్పుడు చిన్న అల్లం ముక్క‌, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసి మూడు లవంగాలు వేసి బాగా మరిగించాలి. ఇవి బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకొని కొద్దిగా తేనె కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. దీనికి క‌ఫం విరిచే శక్తి ఉంది.

దీని తాగడం వల్ల కాఫ‌మంతా బయటకు పోతుంది. ఈ లవంగాల టీలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనితో జలుబు, జ్వరం లాంటి వాటికి చెక్ పెట్టవచ్చు. సైనస్ తో బాధపడే వారు కూడా లవంగాల టీని తరచు తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ లవంగాల టీ తోపాటు కాకరకాయతో చేసిన వంటకాలను తినడం వల్ల కూడా కఫాన్ని త్వరగా తగ్గించవచ్చు. ఈ లవంగాల టీ తాగడం వల్ల వికారం, అజితి, వాంతులు ఇలాంటి సమస్యలు కూడా చెక్ పెట్టవచ్చు.