రష్మిక ఫేక్ వీడియో పై మాజీ ప్రియుడు రియాక్షన్ ఇదే..!!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రష్మికాకి సంబంధించి ఒక మార్పింగ్ వీడియో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ సెలబ్రిటీగా కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా చాలా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు ఈ మార్పింగ్ వీడియో చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు.. దీంతో ఈ విషయం పైన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా స్పందించడం జరిగింది. దీంతో సోషల్ మీడియాకు కూడా కొన్ని నిబంధనలను కూడా వర్తింపచేసేలా చేసింది.

ఇకమీదట ఎవరైనా ఇలా చేస్తే జైలు శిక్షతోపాటు లక్ష రూపాయలు జరిమానా కూడా విధించాల్సి ఉంటుంది అంటూ తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వీడియో పైన రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది.. ఇటీవల తెలుగు తెరపై సూపర్ హిట్ అందుకున్న చిత్రం సప్తసాగరాలు ఇందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన వసంత్ రుక్మిణి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తెలుగులో డబ్ చేయక మంచి రెస్పాన్స్ లభించింది.

ఇప్పుడు ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా విడుదల కాబోతూ ఉండడంతో వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న రక్షిత శెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఫేక్ వీడియో పైన స్పందించారు. ఇలాంటి వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని ప్రతి సాఫ్ట్వేర్ కు ఒక లైసెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో ఉన్నాయి వాటిని అరికట్టాలని తెలియజేశారు.. రష్మిక గురించి మాట్లాడుతూ ఆమె పెద్ద కలలు ఉన్న అమ్మాయి అని తెలియజేశారు ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతున్నది.