ఎక్కువగా కాళ్ళు నొప్పిస్తున్నాయా.. కారణాలు అవే..!!

చాలా మందికి తరచూ కళ్ళా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈమధ్య చిన్నవయసులోనే కూడా ఇలాంటి నొప్పులు సైతం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే ఎందువల్ల వస్తుందో తెలియదు కానీ సడన్గా వచ్చి చాలా ఇబ్బందులకు సైతం గురిచేస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనారోగ్య సంకేతాలకు కారణమా అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే కాళ్ల నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా అది నొప్పి తీవ్రత మీద ఆధారపడి ఉంటుందట.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఇలా జరుగుతుందని పలువురు నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కాళ్ల నొప్పులు అత్యంత సాధారణమైన కారణం కండరాల ఒత్తిడి లేదా అతిగా ఏ రోజైనా పని చేస్తే కచ్చితంగా నొప్పిస్తాయట.. ఏదైనా వాటిని పరిమితికి మించి చేయడం వల్ల ఈ నొప్పులు వస్తాయని వైద్యులు తెలుపుతున్నారు.. మరి కొంతమందికి ఏదైనా గాయం తగిలిన ప్రమాదంలో కాళ్లకు చాలా తీవ్రంగా గాయమైనప్పుడు ఈ నప్పుడు రావడం సర్వసాధారణంగా జరుగుతుందట.లేకపోతే ఎప్పుడైనా కాలు బెణికినప్పుడు.. అది సెట్ అవ్వకపోవడం వల్ల కూడా ఇలా నొప్పి వస్తూ ఉంటుందట.

మన కాళ్లకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో ఏదైనా అడ్డుపడినప్పుడు ఇలా సంభవిస్తుందట.ఈ పరిస్థితి కండరాల రక్తప్రసరణను తగ్గిస్తుంది.. ఇలాంటి వారికి కాళ్లు తిమ్మిరి లేదా బలహీనతకు కూడా మారవచ్చట. కీళ్లపైన ఎక్కువగా ప్రభావితం చేస్తే ఆర్థరైటిస్ వంటివి కూడా ఈ కాళ్ల నొప్పులకు దారితీస్తాయట దీనినే గౌట్ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్ళ కీళ్లల్లో మంట అసౌకర్యంగా కూడా అనిపిస్తుందట.