భారత్ వరల్డ్ కప్ విన్‌ అయితే అలా చేస్తా.. టాలీవుడ్ బ్యూటీ బోల్డ్ ఆఫర్..

ప్రస్తుతం టీమ్ఇండియా వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇండియా వరుస విజయాలను సాధిస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది. 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయాన్ని అందుకుంది. టోర్నీ ప్రారంభం నుంచి అపజయం అనేది లేకుండా దూసుకువెళుతుంది. వరల్డ్ కప్ 2023 లో భారత్ విజయయాత్ర కొనసాగిస్తుంది. ఆదివారం జరిగే ఫైనల్ బిగ్ ఫైట్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఈసారి వరల్డ్ కప్ భారత్ గెలవడం ఖాయం అన్నట్లే సూచనలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం జట్టులో అందరూ మంచి ఫామ్ లో దూసుకుపోవడమే.

ఇలాంటి టైం లో వైజాగ్ ముద్దుగుమ్మ టాలీవుడ్ బ్యూటీ అయిన రేఖ భోజ్ తన సోషల్ మీడియా వేదికపై ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. బోల్డ్ సినిమా ఆయన మాంగల్యం, దామిని విల్లా, కాత్యాయని, స్వాతి చినుకు, రంగీలా లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి కవర్ సాంగ్స్ చేస్తూ కొనసాగుతుంది. ఇక ఇటీవ‌ల ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తా అంటూ పోస్ట్ షేర్ చేసింది రేఖ‌. పరదేశాలలో స్ట్రీకింగ్ ఎప్పటి నుంచో ఉంది.

తమ గేమ్ విన్ అయినప్పుడు ఫుట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ జట్లలో కొంతమంది ఆనందంతో బట్టలిప్పేసి పరుగులు తీస్తూ ఉంటారు. అలా ఒంటిపై బట్టలు లేకుండా పరిగెత్తడాన్నే స్ట్రీకింగ్ అంటారు. ఇక ప్రస్తుతం రేఖా బోజ్ కూడా అలా చేస్తానంటూ.. ఫైనల్ మ్యాచ్లో ఇండియా విన్ అవ్వడం కంటే హ్యాపీ న్యూస్ ఏముంటుంది అంటూ వివరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో న్యూడ్ గా పరిగెడతానని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది.

ప్రస్తుతం న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమెపై నెట్టిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. ఇండియా గెలిస్తే నువ్వు బట్టలు తీసి పరిగెత్తి పరువు తీస్తావా అంటూ.. గుర్తింపు కోసం ఇలాంటి చెత్త పనులు చేయడానికి సిగ్గు అనిపించదా అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీనికి స్పందించిన రేఖ బోజ్‌ మనస్ఫూర్తిగా ఇండియన్ క్రికెట్ టీం పై అభిమానంతో చెబుతున్నాను.. నాకు ఎలాంటి హైప్ క్రేజ్‌ అవసరం లేదు. క్రికెట్ పై అభిమానంతో ఇలా చేస్తున్న తప్పితే హై.్‌ కోసం కాదు అంటూ రిప్లై ఇచ్చింది.