వరుణ్-లావణ్య రిసెప్షన్ జరిగే వేదిక యజమాని ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు.. మన తెలుగు హీరోనే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ లావణ్య ఇటలీకి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. మెగా- అల్లు – లావణ్య త్రిపాఠి – కామినేని కుటుంబం కూడా ఇటలీలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు మెగా ఫ్యామిలీ .

కాగ ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్య పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. నవంబర్ 1 ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వబోతున్నారు . ఈ రిసెప్షన్ కి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 5,000 మంది వరకు అతిథులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది చాలా పెద్ద కన్వెన్షన్ హాల్ అని కూడా తెలుస్తుంది. లగ్జరీ వేడుకలకు ఇదే కేరాఫ్ అడ్రస్ .. ఇప్పటికే ఇక్కడ చాలామంది స్టార్స్ రిసెప్షన్స్ చేసుకున్నారు . అయితే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ఎవరిదో కాదు.. అక్కినేని నాగార్జునది . ప్రముఖ వ్యాపారవేత్త నల్లా ప్రీతం రెడ్డితో కలిసి భాగస్వామ్యంతో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కి యజమానిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది..!!