టాలీవుడ్ లో దుమారం రేపిన విశ్వక్‌సేన్ ట్వీట్.. డిలీట్ చేసిన యంగ్ హీరో.. ప్రమోషనల్ స్టంట్టేనా..?!

టాలీవుడ్ లో యాంగ్రీ యంగ్ హీరో విశ్వక్సేన్ ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి కృష్ణ చైతన్య డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8న ప్రేక్షకుల రానుందని మేకర్స్ అనౌన్స్ చేసినా.. అదే రోజున మరిన్ని సినిమాలు పోటీకి రావడంతో గ్యాంగ్స్ఆప్ గోదావరి రిలీజ్‌పై ప్రస్తుతం సస్పెన్స్ మొద‌లైంది. ఇక ఈ రోజు (అక్టోబర్ 29) విశ్వక్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ టాలీవుడ్ లో దుమారం రేపింది.

 

బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి ఒక్కరు ఆడుకుంటారు అంటూ ఘాటు విమర్శలు చేశాడు విశ్వ‌క్‌. డిసెంబర్‌లో గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి రిలీజ్ కాకపోతే ఆ సినిమా ప్రమోషన్స్ లోనే నేను కనిపించబోనని ఈ పోస్టులో పేర్కొన్నాడు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనే భావిస్తాడు. అస‌లు సినిమా చూడకుండా ప్రతి హిట్, ప్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ మీ నిర్ణయమే ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే డెసిషన్ కాదు. తగ్గే కొద్ది మింగుతూనే ఉంటారని అర్థమైపోయింది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు.. మహాకాళి మాతో ఉంది. ఒకవేళ డిసెంబర్ రిలీజ్ కాకపోతే ప్రమోషన్స్‌లో నన్ను ఇంకా చూడరు అని విశ్వక్‌ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ నెట్టింట దుమారంరేపింది. ఎవరిని ఉద్దేశించి ఇలా అన్నారని అంశం చర్చనీయాంశంగా మారింది. పోస్ట్ చేసిన కొంత సమయానికి ఆ ట్విట్‌ డిలీట్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు విశ్వక్. అయితే విశ్వక్ చేసిన ఈ ట్విట్‌ ప్రమోషన్ స్టంట్ అంటూ కొందరు నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. నిజంగా ఆక్రోషంతో పోస్ట్ చేసి ఉంటే డిలీట్ ఎందుకు.. చేసినట్లు అని ప్రశ్నిస్తున్నారు. సినిమా ఎక్కడ వాయిదా పడుతుందో అనే బాధతో విశ్వక్ అలాంటి ట్విట్ చేశాడని విశ్వక్ ఫ్యాన్స్ ఆయనను సమర్థిస్తున్నారు . ఏది ఏమైనా ఈ ట్వీట్ ద్వారా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ వచ్చింది.