అన్నయ్య కోసం తమ్ముడు చేస్తే త‌ప్పేంటి .. నాని సెన్సేషనల్ కామెంట్స్ (వీడియో)..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా.. శౌర్యూవ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ” హాయ్ నాన్న “. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో బేబీ కియారా ఖన్ టాలీవుడ్కు పరిచయం అవ్వనుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్ నాని అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా టీజర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ సినిమాను మొదటగా డిసెంబర్ 21న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ప్రభాస్ ” సలార్ ” మూవీ కారణంగా ముందుకు రావాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీడియాతో పంచుకున్నాడు నాని. నాని మాట్లాడుతూ…” హాయ్ నాన్న సినిమాను 21కి విడుదల చేయాలని అనుకున్నాము.. అయితే ఇప్పడు ఒక ఇంట్లో, ఓ కుటుంబంలో అన్నయ్య ఫంక్షన్ ఉందనుకోండి.. తమ్ముడు వేరే డేట్ మార్చుకున్నాడు కదా.

కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇక డిసెంబర్ అంతా ఒక మంచి లవ్ స్టోరీ తో.. మంచి యాక్షన్ ఫిలింతో కలకలలాడుతుందంటే అంతకంటే మనకు ఏం కావాలి ” అంటూ చెప్పుకొచ్చాడు నాని. ప్రభాస్ ను అన్నయ్యగా పోల్చుతూ నాని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.