హిట్ అని ముందే తెలిసినా అనుష్క రిజెక్ట్ చేసిన వెంక‌టేష్ సినిమా ఏదో తెలుసా?

సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టికి ఉన్న క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హోదాను అందుకున్న అనుష్క‌.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సినిమాలు చేసింది. అలాగే ప‌లు సినిమాల‌ను రిజెక్ట్ కూడా చేసింది. అలాగే రిజెక్ట్ చేసిన సినిమాల జాబితాలో విక్ట‌రీ వెంక‌టేష్ సూప‌ర్ హిట్ మూవీ కూడా ఒక‌టి.

గ‌తంలో వెంక‌టేష్‌, అనుష్క రెండు సినిమాల్లో యాక్ట్ చేశారు. అందులో చింత‌కాయ‌ల ర‌వి ఒక‌టి కాగా.. మ‌రొక‌టి నాగ‌వ‌ల్లి. అయితే చాలా మందికి తెలియ‌ని విష‌యం ఏంటంటే.. వెంకీ, అనుష్క కాంబోలో మ‌రో మూవీ మిస్ అయింది. అదే `నార‌ప్ప‌`. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించారు. తమిళ బ్లాక్ బ‌స్ట‌ర్ అసురన్ సినిమాకు రీమేక్ ఇది.

క‌రోనా కార‌ణంగా 2021లో నేరుగా ఓటీటీలో విడుద‌లైన నార‌ప్ప‌.. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. భారీ వ్యూస్ తో రికార్డులు తిర‌గ‌రాసింది. అయితే ఈ సినిమాలో వెంక‌టేష్ కు జోడీగా ముందు అనుష్క‌నే సంప్ర‌దించారు. స్టోరీ విన‌డానికి సినిమా హిట్ అని అనుష్క ముందే గ్ర‌హించింది. కానీ, ఆ టైమ్ లో త‌న‌కు సినిమాలు చేసే మూడ్ లేక‌పోవ‌డంతో సున్నితంగా తిర‌స్క‌రించింది. దాంతో అనుష్క‌కు బ‌దులుగా ప్రియ‌మ‌ణిని తీసుకున్నారు. అలా వెంకీ, అనుష్క కాంబోలో నార‌ప్ప వంటి సూప‌ర్ హిట్ మిస్ అయిపోయింది.