నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత వరుస హ్యాట్రిక్ హిట్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండ ముందు వరకు బాలయ్య వేరు. అఖండ తర్వాత బాలయ్య ఎంచుకుంటున్న కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో వరుస విజయాలను అందుకుంటున్నాడు. అదేవిధంగా ఇటీవల నటించిన భగవంత్ కేసరి సినిమా కూడా అంచనాలను మించి సక్సెస్ సాధించింది. ఇక బాలయ్య బాబి తో తన నెక్స్ట్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. #NBK109 టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది.
నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ నుంచి ఈ మూవి షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత బాలయ్య ఎవరితో సినిమాలు చేస్తారు అనేదానిపై పూర్తిగా క్లారిటీ రాకపోయినా కొన్ని ప్రాజెక్టులకు టీమ్ రెడీ అయినట్లు సమాచారం. మరో మూడేళ్ల దాకా బాలయ్య ఫుల్ బిజీ షెడ్యూల్ తో గడుపుతాడని తెలుస్తుంది. బాలయ్య 110 వ సినిమా బోయపాటి రూపొందిస్తున్నాడు. ఈ సినిమా అఖండ సీక్వెల్ గా కౌంట్ అవుతుంది. అఘోర పాత్రను కంటిన్యూ చేస్తూ పొలిటికల్ టచ్ తో ఈ స్టోరీని రెడీ చేస్తున్నాడట బోయపాటి. ఇక బాలయ్య 111వ సినిమాకు డైరెక్టర్ పూరి జగన్నాథ్, గోపీచంద్ మలినేని ఇద్దరు పోటీ పడుతున్నారు. పూరి జగన్నాథ్ తో మరో సినిమా చేస్తానని బాలయ్య గతంలోని మాటిచ్చారు.
పూరి కూడా బాలయ్య కోసం కథను రెడీ చేసుకున్నాడట. ఇటు వీర సింహారెడ్డి సూపర్ హిట్ అయ్యాక మరోసారి గోపీచంద్ తో సినిమా చేస్తానని కూడా బాలయ్య చెప్పారు. ఈ సినిమాను కూడా వీర సింహారెడ్డిని నిర్మించిన మైత్రి మూవీస్ వాళ్లే ప్రొడ్యూసర్స్ గా ఉంటారు. గోపీచంద్ మలినేని, పూరి జగన్నాథ్ సినిమాల్లో ముందు వెనక అయినా సరే 111, 112 సినిమాలుగా ఈ ప్రాజెక్టులు ఉంటాయి. ఇక బాలయ్య 113 వ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతుందని.. లేదా వింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట డైరెక్షన్‌లో ఉండబోతుందని న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం బాలయ్యకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇక మూడేళ్ల వరకు బాలయ్య డేట్స్ ఖాళీ ఉండవనేది స్పష్టమౌతుంది.