అంజనా-నాని ప్రేమ పెళ్లి లో ఇన్ని ట్విస్టులా.. అచ్చం ఆ సినిమా స్టోరీ లానే ఉందే..!

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి నాచురల్ స్టార్ అనే బిరుదును సంపాదించుకున్నాడు నాని. ఈయన కెరీర్ తొలినాళ్లలో రేడియో జాకీగా అలరించాడు. నాని పూర్తి పేరు ఘంటా నవీన్ బాబు. రాంబాబు, విజయలక్ష్మి దంపతులకు 1984 ఫిబ్రవరి 24న జన్మించాడు నాని. ఈయనకి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు దీప్తి. అష్టా చమ్మా సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టి మంచి గుర్తింపు పొందాడు. ఆ తర్వాత అనేక సినిమాలు చేస్తూ తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తోన్న నాని… ఇటీవలే సరిపోదా శనివారం అనే టైటిల్ తో కొత్త సినిమాని ప్రకటించాడు.

ఇక 2012లో అక్టోబర్ 27న అంజనా ఎలవర్తి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. తాజాగా వీరిద్దరికీ పెళ్లి జరిగి నిన్నటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాని తన ఇన్స్టాలో ఓ అరుదైన ఫోటోను పంచుకున్నాడు. తన భార్యకు నుదుటిన బొట్టు పెడుతున్న ఫోటోను షేర్ చేశాడు. ” మా బంధానికి 11 సంవత్సరాలు ” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే నానికి ఫేస్ బుక్ ద్వారా అంజనా పరిచయమైనట్లు తెలుస్తుంది. ఐదేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దలను ఒప్పించి 2012లో వివాహం చేసుకున్నారు. కాగా విశాఖపట్నానికి చెందిన అంజనా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది.

అయితే మొదట నానితో పెళ్లికి అంజనా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట. అనంతరం నాని ఎదుగుదలను చూసి వివాహానికి ఒప్పుకున్నారట .జనాలకు వీరి లవ్ స్టోరీ వింటుంటే… అచ్చం తెలుగు ఇండస్ట్రీలో ఓ బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్న ప్రేమాయణం లానే కనిపిస్తుంది. బహుశా నాని ఆ సినిమాని చూసి అంజనాకు ఆ విధంగా ప్రపోజ్ చేశాడేమో అని జనాలు అనుకుంటున్నారు. ఏది ఏమైనా సరే అంజనా ,నాని హ్యాపీగా కలిసి ఉన్న.. ఈ ఫొటోస్ చూస్తుంటే జనాలకి మంచి కిక్కిస్తుంది. ఈ జంట ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు.