సితార పాప లెహంగా ధర తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే !

సినిమా హీరోల కుమారులు సినీ ప్రపంచంలో బాగా పాపులర్ అవ్వడం కొత్తేమి కాదు. కానీ కూతుర్ల విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. కానీ ఈ ధోరణకి విరుద్ధంగా తన భవిష్యత్తును తానె ఏర్పరుచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది ఒక స్టార్ కిడ్. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అందులోను సినీ ప్రీమికులకు పరిచయం అవసరం లేని పేరు సితార ఘట్టమనేని. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల కుమార్తె. అతి చిన్న వయసులోనే తన టాలెంట్ తో బాగా పాపులర్ అయ్యి, సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ మధ్య పి ఏం జె జ్యువెలర్స్ కోసం ఆమె చేసిన యాడ్ కో అందిన పారితోషకాన్ని చారిటీకి ఇచ్చి తన ఉదార స్వభావాన్ని చాటి చెప్పింది.

సితార ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో తాజాగా దసరా సందర్భంగా తన అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా, ఒక ఎరుపు రంగు లెహంగాను ధరించి తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఈ ఫోటోలను లైక్ చేసి, షేర్ చెయ్యడమే కాకుండా, ఆమె ధరించిన ఆ లెహంగాకు కూడా ఫిదా అయిపోయారు. వెంటనే ఆ లెహంగా ఎంత ఉంటుందో తెలుసుకునే పనిలో పడ్డారు.

సితార పాపా ధరించిన ఆ లెహంగా, సుమారు రెండు లక్షల పైనే ఉంటుందనే వార్త ఇప్పుడు నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఎప్పుడు డిజైనర్ డ్రెస్లు మాత్ర ధరించేందుకు ఇష్టపడే సితార, ఈసారి కూడా అదే బాటలో తన డ్రెస్ ను ఎంపిక చేసుకుంది. సితార దసరా ఫోటో షూట్ కోసం ఎంచుకున్న ఈ లెహంగా స్టార్ డిజైనర్ వరుణ్ చక్కిలం డిజైన్ చేసారు. ఈ లెహంగా అతని అఫిషియల్ వెబ్సైటు లో కూడా ఉంది. ఐతే ఈ వెబ్ సైట్ లో ఈ లెహంగా ధర, రెండు లక్షల పది వేలు గా ఉంది. ఇది చూసిన నెటిజన్లు ఈ వార్తను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.