ప్రియాంక చోప్రా చేతికి ఉన్న ఆ వాచ్ విలువెంతో తెలుసా.. కొట్టేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది!

గ్లోబ‌ర్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పి హీరోల రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. ప్ర‌స్తుతం హాలీవుడ్ లోనూ స‌త్తా చాటుతోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ కెరీర్ ను ప‌రుగులు పెట్టింది. ఇక‌పోతే అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను పెళ్లి చేసుకున్న అమెరికాలో స్థిర‌ప‌డిపోయిన ప్రియాంక‌.. చాలా రోజుల త‌ర్వాత ఇండియాలో ద‌ర్శ‌న‌మిచ్చింది.

ముంబైలో జ‌రుగుతున్న జియో మామి ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2023లో పాల్గొంనేందుకు ప్రియాంక చోప్రా ఇండియాకు వ‌చ్చింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో ట్రెండీ దుస్తులో ధ‌రించి ప్రియాంక అంద‌రినీ ఆక‌ర్షించింది. అయితే ఇప్పుడు ఆమె చేతికి ఉన్న వాచ్ ధ‌ర హాట్ టాపిక్ గా మారింది.

ప్రియాంక ధ‌రించిన ఆ ల‌గ‌ర్జీ వాచ్ 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్ తో చేయ‌బ‌డింది. Bvlgari Serpenti Spiga బ్రాండ్ కు చెందిన వాచ్ ఇది. ఈ వాచ్ విలువ ఎంతో తెలుసా.. దాదాపు రూ. 1.5 కోట్లు. ప్ర‌స్తుతం ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఒక్క వాచ్ కోసం ప్రియాంక అంత ఖ‌ర్చు పెట్టిందా అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. ఇంకొంద‌రు ఆ వాచ్ కొట్టేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అంటూ స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.