గత 10 ఏళ్లుగా కోహ్లీ తింటున్న ఏకైక ఫుడ్ అదే.. అందుకే గ్రౌండ్ లో సెంచరీలు బాదేస్తున్నాడు..!

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈయన కెప్టెన్సీగా బాగా బాధ్యతలు నిర్వహించాడు. తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచెస్ లోను బాగా ఆడుతున్నాడు. అలాగే సెంచరీలు కూడా చేస్తున్నాడు. రీసెంట్ గా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ మిస్ అయిపోయాడు. ఈయన కెరీర్ పక్కన పెడితే… ఫ్యామిలీ పరంగా అనుష్క శర్మ వచ్చిన తర్వాత ఈయన ఫుడ్ డైట్ మొత్తం మారిపోయిందట.

అంతకుముందు తనకు నచ్చిన ఫుడ్ తిని బాడీ కూడా పెంచేసేవాడు. కానీ ఎప్పుడైతే అనుష్క శర్మతో ప్రేమలో పడ్డాడో.. అప్పటినుంచి అనుష్క ఆయన ఫుడ్ బాధ్యతలు తీసుకునింది. మంచి ఫుడ్ డైట్ ని ఫాలో చేసింది. టీమిండియా బస చేసిన హోటల్స్‌లో ఒకటైన లీలా ప్యాలెస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ అనుష్మాన్‌ బాలి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు.

” విరాట్ మాంసం అస్సలు తినడు. మాక్ మీట్స్, టోఫు ఇంకా ఆవిరిపై ఉడికించిన ఆహార పదార్థాలు తినడానికే ప్రాధాన్యం ఇస్తాడు. కాబట్టి మేము కూడా అతడు కోసం అలాంటి ఫుడ్ ని మాత్రమే తయారు చేస్తాం. ప్రోటీన్లు ఎక్కువగా లభించే ఆహారాన్ని మాత్రమే కోహ్లీకి అందిస్తాము. కొద్ది మోతాదులో పాల ఉత్పత్తులు కూడా కోహ్లీ భోజనంలో ఉండేలా చూసుకుంటాం ” అంటూ అనూష్మాన్ పేర్కొన్నాడు.