ఆ హీరోయిన్ కారణంగా తండ్రితో తిట్లు తిన్న వెంకటేష్.. !!

సినిమా అనేది రంగుల ప్రపంచం అని అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. అలాగే తెరపై కనిపించే వారి జీవితాల్లో కూడా ఏమీ లేకున్నా ఏదో ఉన్నాయి అంటూ రూమర్స్ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలోకి వచ్చి హీరో, హీరోయిన్స్ అయినా సెలబ్రిటీస్ ఎవరైనా ఇలాంటి గాసిప్స్‌కు గురవుక తప్పదు. ఈ విషయం సాధారణ ప్రేక్షకులకు కూడా తెలుసు. కానీ ఇప్పటివరకు రూమర్లకు ఆమడ దూరంలో ఉన్నాడనుకున్న స్టార్ హీరో వెంకటేష్ కూడా అందుకు అతీతుడుకాదు.

గతంలో వెంకీ పై వచ్చిన రూమర్స్ భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నాడఅట వెంకటేష్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్న వెంకటేష్ కోట్ల పదిమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. మరీ ముఖ్యంగా సౌందర్య – వెంకటేష్ కాంబోలో వచ్చిన సినిమాలు అభిమానులను తెగమెప్పించాయి. వీళ్ళ జంటను చూడడానికే అభిమానులు ప్రత్యేకంగా థియేటర్స్ కు వెళ్ళేవార‌న‌టంలో అతిశయోక్తి లేదు. అంతలా వీరు కెమిస్ట్రీ వెండితెరపై ఉండేది.

ఈ క్రమంలోనే వీళ్ళ మధ్య ఎఫైర్ ఉందంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది వీళ్ళ గురించి తప్పు తప్పుగా మాట్లాడుకున్నారు. ఆ మాటలు వెంకటేష్ తండ్రి డాక్టర్ డి.రామానాయుడు చెవిలో పడడంతో వెంటనే వెంకటేష్ వాళ్ళిద్దర్ని పిలిపించి క్లాస్ పీకారట. దీంతో కొడుకుని నమ్మకుండా బయట వాళ్ళ మాటలను నమ్మి అవమానించాడు అంటూ హర్ట్ అయిన వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట‌. కానీ అలా సూసైడ్ చేసుకుంటే తన నిజంగా తప్పు చేసినట్లు అవుతుందని ఆలోచన విరమించుకున్నాడట. త‌ర్వాత‌ ఆ రూమర్స్‌ని ఈ జంట పట్టించుకోవడం మానేశారు.